![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -750 లో..... రాజ్, యామినిల నిశ్చితార్ధం పెళ్లి అన్ని ఏర్పాట్లు చేస్తారు. రాజ్ అయిష్టంగానే ఉంటాడు. ఇద్దరు రింగ్ లు మార్చుకోవడానికి సిద్ధం అవుతారు. ఉంగరాలు తీసుకొని వైదేహి వస్తుంటే.. కనకం కావాలనే వైదేహీని పడేలా చేస్తుంది. ఉంగరాలున్న బాక్స్ కిందకి పడిపోతాయ్.
వెంటనే కనకం అందులో నుండి ఉంగరాలు వైదేహీకి తెలియకుండా తీస్తుంది. చూసుకోవాలి కదా వైదేహి గారు అని కనకం అంటుంది. మీలా డబ్బున్న వాళ్ళింటికి కోడలిని చేయాలని.. నాకేం కోరికలు లేవని వైదేహి అంటుంది. దాంతో అవునండి పెళ్లి అయిన వాళ్ళని వేరు చేసి కూతురిని ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన నాకు లేనందుకు సిగ్గుపడుతున్నానని కనకం కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత యామిని, రాజ్ ఉంగరాలు మార్చుకోవాలని చూసేసరికి రింగ్స్ ఉండవు. దాంతో అపచారం అంటూ ఇందిరాదేవి వాళ్ళు అంటుంటారు. దాంతో ఏం పర్లేదు బావ.. నీ చేతికి ఒక రింగ్.. నా చేతికి ఒక రింగ్ ఉందిది.. ఇవే మార్చుకుందామని యామిని అంటుంది.
ఇక ఆ ఉంగరాలు మార్చుకునే టైమ్ కి కళ్యాణ్ బయటకు వెళ్లి ఏదో శబ్దం చేస్తుంటాడు. ఆ సౌండ్ కి అందరు బయట వైపు చూస్తారు. కనకం మాత్రం తెలివిగా యామినికి రాజ్ తోడిగినట్లు ఉంగరం తొడుగుతుంది. అది పంతులు చూసి షాక్ అవుతాడు. యామిని రాజ్ తొడిగాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావ్య కూడా రాజ్ ఉంగరం తొడిగాడని బాధపడుతుంది. రా బావా అంటు యామిని గర్వంగా తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |